అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. దీంతో ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2: ది రూల్’ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే, 12 సంవత్సరాల కంటే పైబడిన వారు ఈ సినిమాను చూడవచ్చు. కొన్ని సన్నివేశాలు కొంచెం హింసాత్మకంగా ఉండటం వల్ల చిన్న పిల్లలు తల్లిదండ్రులతో కలిసి చూడాలి. అల్లు అర్జున్ ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో “యు/ఎ ఇట్ ఇస్!!” అని పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకున్నారు.

నవంబర్ 28న సెన్సార్ బోర్డు తెలుగు వెర్షన్‌ను పరిశీలించి, కొన్ని మార్పులు చేయాలని సూచించింది. ముఖ్యంగా “r*i” అనే పదం మూడు సార్లు వచ్చిన చోట ఆ పదాన్ని తీసివేయాలని, “D*g*dd*”, “వెంకటేశ్వర్” అనే పదాలను కూడా తొలగించాలని సూచించారు. లపాకీ, భగవంతుడు వంటి పదాలతో వాటిని రీప్లే చేయాలని సూచించింది. అంతే కాదు ఒక పదానికి రీప్లేస్ చెప్పలేక దాన్ని మ్యూట్ చేయాలని సూచించారు.

అలానే సెన్సార్ బోర్డు, పుష్ప 2 సినిమాలోని రెండు హింసాత్మక దృశ్యాలను మార్చాలని సూచించింది. ఒక సన్నివేశంలో కాలు గాల్లో ఎగురుతూ ఉన్న దృశ్యాన్ని తొలగించారు. మరో సన్నివేశంలో హీరో చేతిలో కోసిన చేయి ఉండే దృశ్యంలో, ఆ చేయి కనిపించకుండా హీరోపైనే దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ మార్పుల తర్వాతే సినిమాకు యు/ఎ సర్టిఫికేట్ లభించింది.

పుష్ప 2 సినిమా రన్‌టైమ్ 3 గంటలు 20 నిమిషాలు 38 సెకన్లు. అంటే, మొదటి భాగం కంటే 40 నిమిషాలు ఎక్కువ. గతేడాది విడుదలైన ‘యానిమల్’ సినిమా రన్‌టైమ్ 203 నిమిషాలు కాగా, పుష్ప 2 రన్‌టైమ్ దాదాపు అంతే ఉండటం విశేషం. పుష్ప 2 సినిమా మొదటి భాగంలాగే బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.









మరింత సమాచారం తెలుసుకోండి: