దగ్గుబాటి లక్ష్మి ..నాగార్జున మొదటి భార్య.  ఈ పేరు జనాలకి బాగా తెలుసు . కానీ ఆమె గురించి మాత్రం తెలిసింది కొంతమందికి మాత్రంకే.  లక్ష్మీ అంటే దగ్గుబాటి రామానాయుడు గారి కూతురు.  సురేష్ బాబు - వెంకటేష్ ల సిస్టర్ . ఇంతవరకే తెలుసు . నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య ఇంకొంచెం ముందుకెళ్తే ఆమె నాగార్జునకు విడాకులు ఇచ్చిన తర్వాత మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయింది .ఇంతవరకే తెలుసు కానీ అంతకుమించిన స్టెప్ ఎవరికీ తెలియదు. 


అయితే తాజాగా లక్ష్మికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . నాగార్జున మొదటి భార్య లక్ష్మి తన కొడుకు నాగచైతన్య పెళ్లి కోసం చాలా చాలా కష్టపడుతున్నారు . అంతేకాదు మొదటి కోడలు సమంతకి ఏ గిఫ్ట్ అయితే ఎలాంటి గౌరవం అయితే ఇచ్చారో .. అలాంటి గౌరవమే  రెండో కోడలు శోభిత ధూళిపాళ్లకు ఇస్తున్నారట.  అంతేకాదు సమంతకి తన పెళ్లిలో ఇచ్చిన డైమండ్ నెక్ సెట్ ని ఇప్పుడు శోభిథ ధూళిపాళ్లకు కూడా ఇవ్వబోతున్నారట .



ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత లక్ష్మి ..సమంతకి డైమండ్ నెక్ సెట్ ఇచ్చారు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.  అయితే విడాకుల తర్వాత ఆ గిఫ్ట్ రిటర్న్ చేసేసింది సమంత . ఇప్పుడు అదే గిఫ్ట్ శోభిత ధూళిపాళ్లకు ఇవ్వబోతుందట . సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కొందరు లక్ష్మి ని నెగిటివ్ గా ట్రోల్ చేస్తుంటే .. మరి కొందరు మాత్రం ఆమె మంచి మనసుని అర్థం చేసుకుంటున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత సమంతని ఏ విధంగా దూషించకుండా ఆమె మాట్లాడిన పద్ధతి అదే విధంగా పెద్ద కోడలికి ఏ  స్థానం ఇచ్చిందో ఆ తర్వాత ఆ స్థానం నుంచి తప్పకన్నా కూడా  రెండో కోడలికి కూడా అదే స్థాయిని ఇవ్వాలి అంటూ ట్రై చేస్తూ ఉండటం నిజంగా ఆమె గట్స్ కి ఆమె మంచితనానికి నిదర్శనం అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: