దీనితో సోషల్ మీడియాలో కీర్తి సురేష్ - ఆంటోని పేర్లు బాగా ట్రెండ్ అవుతూ మారుమ్రోగిపోతున్నాయి . అంతేకాదు వీళ్ళ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా విషెస్ అందిస్తున్నారు. ఇదే మూమెంట్లో కీర్తి సురేష్ కి సంబంధించిన మరొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది. కీర్తి సురేష్ పెళ్లికి ముందే ఆంటోనీ చేస్తున్న బిజినెస్ లో భాగం కాబోతుందట . సాధారణంగా పెళ్లి తర్వాతే భర్త ఆస్తిపాస్తుల్లో భార్యకు వాటా వస్తుంది .
కాని కీర్తి సురేష్ విషయంలో బాగా ముందుకు వెళ్లిపోయారు ఆంటోని. ఎంతలా అంటే పెళ్లి కాకుండా నే ఆయన తన బిజినెస్ లో సగం వాటా ఇస్తూ అగ్రిమెంట్ పై సైన్ చేసి మరి కీర్తి సురేష్ పై ఉన్న ప్రేమని ప్రూవ్ చేసుకున్నారట. అంతేకాదు కీర్తి సురేష్ పెళ్లి తర్వాత ఆంటోనీ తట్టిల్ బిజినెస్ ని దగ్గరుండి చూసుకోబోతుందట. సినిమాలకి కూడా ఇక దూరం కాబోతుంది అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి . దీంతో ఫాన్స్ షాక్ అయిపోతున్నారు . మహానటి కీర్తి సురేష్ ఇక తెరపై కనిపించదా..? అంటూ బాధ పడిపోతున్నారు. కాగా డిసెంబర్ 11,12 వ తేదీల్లో కీర్తి సురేష్ - ఆంటోని ల పెళ్ళి గోవాలో ఘనంగా జరగబోతుంది..!