దేవర హిట్ తో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. రీసెంట్ గా ఈ సినిమా 50 రోజుల దియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది .. ఇప్పుడు ఇదే జోష్ లో ఎన్టీఆర్ తన తర్వాత సినిమాల షూటింగ్లో కూడా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశలో ఉంది . ఈ సినిమా తో పాటు కేజిఎఫ్ సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ దర్శికుడు ప్రశాంత్ నీల్  డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .


ఇప్పటికే గత నెలలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు మేకర్స్ .. అయితే ఈ సినిమా షూటింగ్ ను ఇంకా మొదలు పెట్టకుండానే ఈ సినిమాను 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు . ఇప్పుడు తాజా గా ఈ సినిమా కు సంబంధించిన మరో అప్డేట్ బయట కు వచ్చింది .. ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ పోస్టర్ వచ్చే సంక్రాంతి కి  విడుదల చేయబోతున్నారట . ఇక జనవరి నుంచి ఒకవైపు వార్ 2 షూటింగ్లో పాల్గొంటూనే ప్రశాంత్ నీల్ సినిమా ను కూడా మొదలు పెట్టబోతున్నారు ఎన్టీఆర్ .. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ని ఎప్పటి నుంచో పరిశీలిస్తున్నారు ..


ఇక‌ ఇప్పుడు ఈ టైటిల్నే అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలుస్తుంది . రవి బస్రూర్‌ సంగీతంతో భారీ బడ్జెట్ తో తెర్కక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారట . ఈసినిమాల్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా నెగిటివ్ టచ్ లో ఉన్న పాత్రలో ఉంటుందని కూడా అంటున్నారు. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాల్లో కూడా ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. అలాగే జై లవకుశ సినిమాలో రావన్ గా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రతో మెప్పించారు. ఇక ఇప్పుడు మరోసారి ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఆ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: