అయితే ఇప్పుడు తాజాగా ఐశ్వర్య కు సంబంధించిన కొత్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఐశ్వర్యరాయ్ మొబైల్ వాల్ పేపర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో పై అభిమానులు కూడా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్గా ఓ ఈవెంట్లో ఐశ్వర్య రాయ్ పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు .. ఆ తర్వాత ఆ కార్యక్రమం ముగించుకుని మళ్ళీ ఇండియాకు వచ్చారు. ముంబై విమానాశ్రయంలో ఆమె కనిపించగానే మీడియా మిత్రులు తమ కెమెరాలు బంధించేందుకు ఏగబడ్డారు .. ఆ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ చేతిలో మొబైల్ ఫోన్ వాల్ పేపర్ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఐశ్వర్య అక్కడి నుంచి బయటికి నడుస్తుంటే మొబైల్ స్క్రీన్ ఆన్ చేసింది .. అందులో వాల్ పేపర్ ఫోటో లో ఐశ్వర్య కూతురు ఆరాధ్య ఒకరితో కలిసి ఉన్నట్టు కనిపించింది. ఆ ఫోటో ఆరాధ్య తాత అమితాబచ్చన్ తో కలిసి ఉన్నదని పలువురు కామెంట్లో చేస్తుంటే ..మరికొందరు ఇది ఐశ్వర్య తండ్రి కృష్ణరాజ్ రాయ్‌తో ఆరాధ్య ఉన్న ఫోటో అని అంటున్నారు. ఇక దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తిన చర్చ జరుగుతుంది. ఆ ఫోటో ఎవరిదీ అన్నది ఇంకా క్లారిటీ రాలేదు . ప్రస్తుతం అభిషేక్ కి ఐశ్వర్యరాయ్ దూరంగా ఉన్నట్లు సమాచారం . ఆరాధ్య బచ్చన్ ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుంది. అయితే అభిషేక్ బచ్చన్ ఎక్కడా కనిపించలేదు.