టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత తాజాగా ఒక చేదు విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన తండ్రి జోసెఫ్ ప్రభు మరణించినట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో "ఇక నేను మిమ్మల్ని కలవలేను" అంటూ హార్ట్ బ్రేక్ అయిన ఎమోజిని పంచుకుంది సమంత. ఇక సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, పలువురు సెలబ్రిటీలు, అభిమానులు తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు.

ఇకపోతే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సమంతకు దెబ్బ మీద దెబ్బ ఆమెను మరింత కృంగదీస్తోందని చెప్పవచ్చు. భర్త నుంచి విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె, ఎన్నో నిందలు కూడా మోసింది. దీనికి తోడు మయోసైటీస్ వ్యాధి.  ఇప్పటికీ ఆ సమస్యతో బాధపడుతూనే ఉంది
ఇలాంటి సమయంలో మాజీ  భర్త మరొక అమ్మాయిని వివాహం చేసుకోబోతుండడం అన్నీ కూడా సమంతకు చేదు జ్ఞాపకాలే అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో తండ్రి కూడా దూరం అవడంతో ఆమె ఒంటరి అయిపోయిందని అభిమానులు దుఃఖం వెళ్ళగకుతున్నారు.

ఇక సమంత విషయానికి వస్తే.. మయోసైటీస్ వ్యాధి నుండి ఇప్పుడిప్పుడే బయట పడ్డ ఈమె.. సిటాడెల్ వెబ్ సిరీస్ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది.. మరొకవైపు నిర్మాతగా మారి మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కానీ ఇందులో తాను కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు సినిమాలు మరొకవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ జెడ్ స్పీడ్ మీద దూసుకుపోతున్న ఈమెకు మానసిక ప్రశాంతత లేదని వ్యక్తం అవుతుంది.. మరి సమంతను ఈ దుఃఖం నుంచి బయటపడేసేది ఎవరో చూడాలి అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: