టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. నటి సమంత తన తండ్రి మరణాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులకు తెలియజేసింది. స్టోరీలో ఆమె 'గుండె పగిలిన' ఎమోజీని పోస్ట్ చేసి 'మనం మళ్లీ కలుసుకునే వరకు నాన్న' అని రాసింది. ఆయన సమంత షోలలో కూడా చాలా అరుదుగా కనిపించేవారు. జోసెఫ్ ప్రభు మరణానికి కారణం ఇప్పటివరకు తెలియదు.
సమంత  జోసెఫ్ ప్రభు, నినెట్ ప్రభు దంపతులకు చెన్నైలో జన్మించారు. జోసెఫ్ ప్రభు తెలుగు ఆంగ్లో-ఇండియన్ అయినప్పటికీ సమంత జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తన ఎదుగుదలకు కారణం జోసెఫ్ ప్రభు అని చెప్పుకొచ్చారు. అలాగే సమంత జీవిత ప్రయాణంలో ఆయన అందించిన మద్దతు గురించి కూడా తరచూ సామ్ ప్రస్తావిస్తూ ఉండేవారు. జోసెఫ్ ప్రభు మరణ వార్త అభిమానులు, శ్రేయోభిలాషులను విషాదంలో ముంచెత్తింది. ఈ నేపద్యంలో నటుడు తేజ సజ్జా ఒక ట్వీట్‌లో సమంతకు మద్దతు ఇచ్చాడు. 'ప్రియమైన సమంతప్రభు మీరు మీ తండ్రితో పంచుకున్న జ్ఞాపకాలలో శాంతిని పొందండి. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చారు. ఈ కష్టకాలంలో సమంతకు శ్రేయోభిలాషులు, సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జోసెఫ్ ప్రభు కూతురు సమంత రూత్ ప్రభు విడాకుల వల్ల డిప్రెషన్ లో ఉన్నారని, అందుకే ఆయన హఠాత్తుగా మరణించారని బయట టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఆయన కార్డియాక్ అరెస్ట్ తో నిన్న రాత్రి నిద్రలోనే కన్నుమూసినట్లు సమాచారం. రేపు సామ్ తండ్రి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సమంత కుటుంబంలో ఇప్పుడు ఆమె తల్లి మరియు ఆమె ఇద్దరు అన్నలు ఉన్నారు. అయితే అసలు ఆయన మరణానికి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: