తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో చాలామంది సెలబ్రిటీలు మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కొంతమంది మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజీ సంపాదించుకున్న హీరోయిన్స్లలో ఇషా కొప్పికర్ కూడా ఒకరు. ఇమే చాలాకాలం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనని ఒక స్టార్ హీరో ఒంటరిగా రమ్మంటూ వేధించారని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది ఇషా కొప్పికర్. ఈ సంఘటన జరిగి 29 ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టింది.


ఈమె నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైంది. ఈ సినిమాలో తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఇమే ఆ తర్వాత పలు చిత్రాలలో స్పెషల్ సాంగులలో కూడా నటించినది.. కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకొని ఒక్కసారిగా ఇండస్ట్రీకి కనుమరుగయ్యింది ఇషా కొప్పికర్. ఇండస్ట్రీలో మనమేం చేయగలం అనేది ఎవరు చూడరని హీరోయిన్స్ ఏం చేయాలనేది మాత్రమే హీరోలు డిసైడ్ చేస్తారంటూ తెలియజేసింది.. విలువలను నమ్ముకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి అంటే చాలా కష్టమని .. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ భయంతోనే చాలామంది అమ్మాయిలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారని తెలిపింది
ఇషా కొప్పికర్.


అలాగే కఠినమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడిన హీరోయిన్ కూడా చాలామంది ఉన్నారని తనకు కూడా 18 ఏళ్ల వయసులో నటిస్తున్న సమయంలో తన దగ్గరకు ఒక నటుడు వచ్చి స్నేహంగానే ఉంటూ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనతో చాలా అసభ్యకరంగా తాకేవారని అప్పట్లో స్టార్ హీరో సైతం తనను ఒంటరిగా కలవాలని ఇబ్బందులు పెట్టే వారిని.. ఆ సమయంలో తనకు ఏం చేయాలో తెలియని పరిస్థితి అని తెలియజేసింది. కొన్ని సందర్భాలలో హీరోలతో నటించాల్సి వచ్చింది అని కూడా తెలియజేసింది ఇషా కొప్పికర్.. అయితే ఇమే చెప్పిన ఆ హీరో ఎవరా అని అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఆ హీరో పేరు బయట పెడుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: