పుష్ప ది రూల్ కారణంగానే కన్నప్ప వాయిదా పడిందా అనే ప్రశ్నకు మంచు విష్ణు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే ప్రతి ప్రొడ్యూసర్ ఒకరితో ఒకరు మాట్లాడుకుని ప్రతి సినిమాకు గ్యాప్ ఉండేలా చూసుకుని విడుదల తేదీలను ప్రకటిస్తున్నామని విష్ణు చెప్పుకొచ్చారు. కన్నప్పను ఆగష్టులో రిలీజ్ చేయాలనుకున్నాం కానీ కుదరలేదని విష్ణు తెలిపారు.
కనీసం డిసెంబర్ లో అయినా ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించామని ఆయన పేర్కొన్నారు. మా సినిమాకు వీ.ఎఫ్.ఎక్స్ ఎక్కువ అని నేను చాలా పనులు నేర్చుకున్నానని విష్ణు వెల్లడించారు. అంత సులువుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగడం లేదని విష్ణు తెలిపారు. డిసెంబర్ లో రిలీజ్ చేయలేదని ఎవరూ అడగరని ఒక మంచి సినిమాను ప్రేక్షకులను అందించాలని ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఏప్రిల్ అయితే అన్నీ అనుకున్నట్టు పూర్తవుతాయని భావిస్తున్నామని విష్ణు వెల్లడించారు. అంతే తప్ప పుష్ప ది రూల్ వస్తుందని కాదని విష్ణు పేర్కొన్నారు. ఈ రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్లు ఒక్కరేనని పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని విష్ణు కామెంట్లు చేశారు. తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగ కన్నప్ప రిలీజ్ చేయాలని ఆయన అన్నారు. అన్ని భాషలు ముఖ్యమేనని ఆయన తెలిపారు. విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంచు విష్ణు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.