ఈ మధ్యకాలంలో నయనతారపై విపరీతమైన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం నయనతారకు సంబంధించిన బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా చేసిన సినిమాకు సంబంధించి సీన్ పెట్టుకున్నందుకు ధనుష్ నయన్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీనిపై ప్రస్తుతం రచ్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే నయనతార పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ ఓ కమెడియన్ నయనతారపై చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఆయన ఎవరంటే.. తంబి రామయ్య.. రీసెంట్గా అర్జున్ సార్జా తన కూతురు ఐశ్వర్య ని తంబి రామయ్య ఇంటికి కోడలుగా చేసిన సంగతి మనకు తెలిసిందే. తంబి రామయ్య కొడుకు ఉమాపతికి ఐశ్వర్య ని ఇచ్చి పెళ్లి చేశారు.ఇక తంబి రామయ్య ఫేమస్ కమెడియన్ అనే సంగతి మనకు తెలిసిందే. 

ఇక ఆయన రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో నయనతార గురించి మాట్లాడుతూ..నాకు నా తల్లి అంటే ఎంతో ఇష్టం.నా తల్లి చనిపోయిన సమయంలో నేను బాధని దిగమింగుకోలేకపోయాను. ఇక కొద్ది రోజులకు నా కూతురు పెళ్లి జరిగింది. దాంతో నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. నేను కూడా నా తల్లి దగ్గరికి వెళ్లి పోవాలి అనుకున్నాను. నేను సూసైడ్ చేసుకొని మరణించాలి అనుకున్నాను. కానీ అదే టైంలో నేను నయనతార తో డోరా సినిమాలో నటించాను. ఆ సమయంలో ఓసారి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నయనతార  కాల్ చేసి నన్ను సూసైడ్ చేసుకోకుండా ఆపింది.

ఒకవేళ ఆరోజు నయనతార ఫోన్ చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని నా తల్లి దగ్గరికి వెళ్లి పోయేవాడిని.కానీ నయనతార ఫోన్ కాల్ వల్లే నేను ఈరోజు బతికి ఉన్నాను. ఒకవేళ నేను బతికి లేకపోతే నా కొడుకు పెళ్లి నేను చూసి చూసేవాడిని కాదు అంటూ తంబి రామయ్య షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు ఎవరికైనా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచనలు వచ్చినప్పుడు ఇష్టమైన వారితో మాట్లాడి బాధలు పంచుకోవాలని,మనకంటే ఇబ్బంది పడుతున్న వాళ్లు ఎలా ఉన్నారో చూసి వాళ్లే బతకగలుగుతున్నప్పుడు మనమెందుకు బతకలేం అనే నిజం తెలుసుకోవాలి అంటూ తంబిరామయ్య చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: