సినిమా ఇండస్ట్రీ లో ప్రేమ వివాహాలు చేసుకొని వాటి వల్ల ఆనందంగా జీవితం గడుపుతున్న వారు ఉన్నారు. ఇక ప్రేమ వివాహాలు విఫలం అయ్యి బాధపడుతున్న వారు ఉన్నారు. ఇకపోతే బుల్లి తెర ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటి దాల్జిత్ కౌర్ ఒకరు. ఈమె తన జీవితంలో నటిగా అద్భుతమైన స్థాయిలో సక్సెస్ ను అందుకున్న తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆ స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయింది. ఈమె రెండు పెళ్లిళ్లు చేసుకోగా రెండు కూడా విఫలం అయ్యాయి.

అసలు విషయం లోకి వెళితే ... ఈ ముద్దుగు మ్మ 2006 వ సంవత్సరం షాలిన్ భానోట్ అనే వ్యక్తిని ఓ సీరియల్ సెట్స్ లో కలుసుకుంది. ఇక వారి ఇద్దరి మధ్య పరిచయం బాగా పెరగడంతో వీరిద్దరూ ప్రేమలో పడిపోయారు. ఇక ప్రేమ మొదలవడంతో 2009 వ సంవత్సరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇక వీరికి జాడెన్ అనే బాబు కూడా ఉన్నాడు. కొంత కాలం పాటు వీరి వివాహ సంబంధం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగింది. కానీ పెళ్లి తర్వాత 6 సంవత్సరాలకు వీరు పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఇక మొదటి వివాహం జరిగి విడాకులు తీసుకున్న తర్వాత ఎనిమిది సంవత్సరాల పాటు ఈ ముద్దు గుమ్మ ఒంటరి గానే జీవితాన్ని గడిపింది. 

ఇక ఆ తర్వాత కెన్యాకు చెందిన వ్యాపారవేత్త అయినటువంటి నిఖిల్ పటేల్ ను పెళ్లి చేసుకుంది. దానితో తన కొడుకుతో పాటు కన్యాకు వెళ్ళిపోయింది. కానీ రెండవ పెళ్లి తర్వాత కొన్ని నెలలకే తన భర్తతో విభేదాలు రావడంతో కొడుకుతో కలిసి మళ్ళీ ఇండియాకు తిరిగి వచ్చింది. పెళ్లయిన సంవత్సరానికే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇక కొంత కాలం క్రితం ఈమె భర్త నిఖిల్ ముంబై విమానాశ్రయంలో తన స్నేహితులతో కనిపించాడు. ఇప్పుడు ఈ నటిమని తన కొడుకుతో ఒంటరిగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: