కొంత కాలం క్రితం శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్గా జాను అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్లో విజయ్ సేతుపతి , త్రిష జంటగా రూపొందిన 96 అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే జాను మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. జాను మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. మరి ఈ సినిమా విజయం సాధించక పోవడానికి గల కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

దిల్ రాజు తాజాగా జాను సినిమా గురించి మాట్లాడుతూ ... 96 సినిమాను నేను తమిళ్లో చూశాను. ఆ సినిమా నాకు అద్భుతంగా నచ్చింది. వెంటనే ఆ సినిమా యొక్క తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నాను. ఇక ఒకానొక సమయం లో ఆ సినిమాను నాని కి చూపించాను. ఆయన సినిమా చూసి అద్భుతంగా ఉంది అన్నాడు. అలాగే అల్లు అర్జున్ కు కూడా ఆ సినిమాను చూపించాను. ఆయన కూడా సినిమా చూసి సూపర్ గా ఉంది అన్నాడు. ఇలా వారంతా అద్భుతంగా ఉంది అనడంతో ఆ సినిమాను శర్వానంద్ హీరోగా సమంత హీరోయిన్గా స్టార్ట్ చేశాను. ఏదైనా సినిమా ఓ టీ టీ లోకి వచ్చిన తర్వాత ఆ సినిమాను రీమేక్ చేయకూడదు. 96 మూవీ జాను విడుదలకు ముందే ఓ టీ టీ లోకి వచ్చేసింది. ఆ సినిమాను అందరూ చూసేశారు.

ఇక ఆ తర్వాత జాను సినిమా విడుదల అయినా కూడా 96 మూవీ తో కంపేర్ చేసినప్పుడు ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. దానితో సినిమా ఆడలేదు. ఎప్పుడైనా ఓ టీ టీ లో వచ్చిన సినిమాలను రీమేక్ చేయకూడదు. 96 మూవీ ఓ టి టి లోకి వచ్చిన తర్వాత జాను మూవీ ని రీమిక్ చేయడం వల్లే ఆ సినిమా ఆడలేదు అని దిల్ రాజు తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: