బన్నీ .. ఈ మధ్య కాలంలో ఏది మాట్లాడినా ఏం చేసినా సరే అది నెగిటివ్ కోణంలో చూడడమే బాగా అలవాటుగా మార్చుకున్నారు కొందరు జనాలు . ఈవెన్ మంచి చేసిన దాన్ని చెడుగానే చూస్తున్నారు . బన్నీ చెడు చేసిన దాని చెడుగానే చూస్తున్నారు . రీజన్ ఏంటో తెలియడం లేదు కానీ బన్నీ పేరుని సోషల్ మీడియాలో దారుణాతి దారుణంగా ట్రోలింగ్ కి గురి చేస్తూనే ఉన్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో బన్నీ పేరు ఎలా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిన విషయమే . మరి ముఖ్యంగా పొలిటికల్ పరంగా ఆయన చిక్కుల్లో ఇరుక్కోవడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. 


తాజాగా పుష్ప2 సినిమాకి సంబంధించిన ఈవెంట్ ముంబైలో నిర్వహించారు మేకర్స్. రష్మిక మందన్నా -  అల్లు అర్జున్ చాలా యాక్టివ్గా ఈ ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేశారు . అంతేకాదు స్టేజ్ పైకి వచ్చిన అల్లు అర్జున్ మాట్లాడుతూ తన సినిమా కోసం ఎంత కష్టపడ్డాను అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పుకొచ్చాడు . అంతేకాదు నా కెరియర్ ఇప్పుడు ఇలా ఉండడానికి వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ సుకుమార్  అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.



"నేను ఇండస్ట్రీలో హీరోగా ఎదిగాను అన్న.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ముందుకెళ్తున్నాను అన్న.. నా సక్సెస్ కి మొత్తం కారణం సుకుమార్" అంటూ అల్లు అర్జున్ ఇన్నేళ్ల తన  కష్టాన్ని మొత్తం సుకుమార్ ఖాతాలో  వేసేసారు. అఫ్కోర్స్ ఆ మాటల్లో వాస్తవం ఉంది . కానీ ఇక్కడ జనాలకి ఒక పెద్ద డౌట్ వచ్చింది. మీ సక్సెస్ కి కారణం మొత్తం సుకుమారైతే . మరి త్రివిక్రమ్ మీతో తెరకెక్కించిన  సినిమాల పరిస్థితి ఏమిటి? జులాయి సినిమా మీ కెరియర్లో సూపర్ డూపర్ హిట్ . అలా వైకుంఠపురంలో సినిమా సూపర్ డూపర్ హిట్. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా మంచి హిట్ అందుకుంది.  సుకుమార్ నీకు ఎన్ని హిట్స్ ఇచ్చాడో త్రివిక్రమ్ కూడా అన్ని హిట్స్ ఇచ్చారు. మరి త్రివిక్రమ్ ని మర్చిపోయావా ..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . నిజమే బన్నీ లైఫ్లో సుకుమార్ కి ఎంత స్థానం ఉందో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కూడా అంతే స్థానం ఉంది . ఆ చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయాడు బన్నీ అంటున్నారు జనాలు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: