అయితే సమంత లైఫ్ లో కీలకపాత్ర పోషించే తండ్రి ఇక లేడు అని తెలియడంతో సమంత ఫ్యాన్స్ కూడా డీలా పడిపోతున్నారు. సమంతకి ఈ టైం లో పాజిటివ్ సపోర్ట్ ఉండాలి అని.. దయచేసి సమంతని ట్రోల్ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు . కాగా సమంత ముంబైలో ఉంది . సిటాడిల్ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతుంది . కాగా గత రెండు రోజుల నుంచి సమంత తండ్రి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందట. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న అతి ప్రాణం మీదకు తీసుకొచ్చేంత ప్రమాదకరం కాదు అంటూ కూడా తెలుస్తుంది.
అయితే సడన్గా ఆయనకు ఆరోగ్యం క్షీణించడం.. అదేవిధంగా హార్ట్ ఎటాక్ రావడం స్పాట్లో నే ఆయన మరణించడం .. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు లా వినిపించేలా చేస్తుంది. అంతేకాదు తండ్రి ఆరోగ్యం బాగోలేదని తెలుసుకున్న సమంత కేరళలోని తమ స్వస్థానాలకి వెళ్లాల్సిందట . కానీ ఒక ఈవెంట్ కారణంగా ఆగిపోయిందట. అంతేకాదు తండ్రి సమంతని చూడాలి అని ఉంది అంటూ లాస్ట్ గా వీడియో కాల్ లో మాట్లాడారట . "ఆరోగ్యం అంత బాగుంది. నువ్వు జాగ్రత్త తల్లి అంటూ సమంతకు బాగోగులు కూడా చెప్పారట". కానీ సడన్గా ఆయన పల్స పడిపోవడం స్పాట్లోనే చనిపోవడం జరిగిపోయిందట. అయితే సమంత తన తండ్రి ఆఖరి మూమెంట్లో కూడా ఆయనతో ఉండలేకపోయింది . అంతేకాదు సమంత తండ్రి ఆమె రెండో పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైతే చూడాలి అంటూ సమంత పిల్లలను ఎత్తుకోవాలి అంటూ బాగా ఆశ పడ్డారట. బ్యాడ్ లక్..ఆయన ఆఖరి కోరిక తీరకుండానే ఆయన స్వర్గస్తులై పోవడంతో ఫాన్స్ బాధపడిపోతున్నారు..!!