నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లారెన్స్ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే లారెన్స్ కు సమాచారం ఇచ్చి సహాయం చేస్తానంటూ ఒక అజ్ఞాత వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నారు. లారెన్స్ సహాయకుడినని చెప్పి ఆ వ్యక్తి చెన్నైలోని ఎగ్మూర్ కు చెందిన వీర రాఘవన్ ను మోసం చేశారు. లారెన్స్ త్వరలో ఒక స్వచ్చంద సంస్థను మొదలుపెట్టనున్నాడని ఆ సంస్థ ద్వారా మీ పిల్లల చదువు ఖర్చు మొత్తం వారే భరిస్తారని చెప్పుకొచ్చారు.
ఆ అజ్ఞాతవ్యక్తి 8457 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని కోరాడని ఇందుకు సంబంధించిన నగదును ఫోన్ పే ద్వారా తాను చెల్లించానని ఆయన చెప్పుకొచ్చారు. అతని మాటలు నమ్మి ఆ తర్వాత 2875 రూపాయలు, 50 వేల రూపాయలు చెల్లించానని ఆయన తెలిపారు. నగదు తిరిగివ్వాలని డిమాండ్ చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చిందని వీర రాఘవన్ వెల్లడించారు.
ఈ మోసం చేసిన వ్యక్తి పేరు దినేశ్ కుమార్ అని అతని స్వస్థలం వేలూర్ అని సమాచారం అందుతోంది. దినేశ్ కుమార్ ను పోలీసులు పుళల్ జైలుకు తరలించారని తెలుస్తోంది. ఈ మోసాల గురించి రాఘవ లారెన్స్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. రాఘవ లారెన్స్ పేరుతో ఇలాంటి మోసాలు జరగడంపై ఆయన అభిమానులు ఫైర్ అవుతుండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల పేర్లు చెప్పి ఈ తరహా మోసాలు చేయడం సాధారణం అయింది.