అయితే ఇదే మూమెంట్లో తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో రష్మిక మందన్నా మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్ లో రష్మిక మందన్నా బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసింది . ఆమె డ్రెస్ పై దారుణాతి దారుణమైన ఘాటు ట్రోలింగ్ కూడా జరుగుతుంది . అయితే ఇదే మూమెంట్లో అక్కడ ఉండే రిపోర్టర్ లు రష్మిక ని కూడా కొన్ని ప్రశ్నలు వేశారు. "పుష్ప సినిమాతో బన్నీ నేషనల్ అవార్డు అందుకున్నారు..? పుష్ప 2 సినిమాతో మీకు కూడా నేషనల్ అవార్డు వస్తుంది అనుకోవచ్చా..?" ..అంటూ ప్రశ్నించారు.
"అయితే కచ్చితంగా అనుకోండి ..ఈసారి నేషనల్ అవార్డు పక్క "అంటూ ఆన్సర్ ఇచ్చింది రష్మిక మందన్నా. దీంతో రష్మిక మందన్నా మాట్లాడిన మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . కచ్చితంగా ప్రతి ఒక్క యాక్టర్ కి నేషనల్ అవార్డు అనేది ఒక డ్రీమ్ . కచ్చితంగా అందరు దానికోసం బాగా ట్రై చేస్తారు. అయితే రష్మిక మందన్నాకు అసలు ఏం చూసి పుష్ప 2 సినిమాలో నేషనల్ అవార్డు వస్తుంది అని అనుకుంటుంది..? అంటూ మాట్లాడుతున్నారు జనాలు. పుష్పరాజ్ భార్య గా శ్రీవల్లి ఒక క్యారెక్టర్ అంతే తప్పిస్తే అది ఏమీ ఏ స్టార్ హీరోయిన్ బయోపిక్ కాదు.. అలా అని ఆమె నటన మొత్తం విజృంభించేసే స్థాయిలో లేదు .. చీర కట్టుకొని నగలు పెట్టుకొని హుందాగా కనిపిస్తే నేషనల్ అవార్డ్ ఇచ్చేస్తారా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . రష్మిక మాట్లాడిన మాటలు ఇప్పుడు పుష్ప 2 సినిమాకి నెగిటివ్ ట్రోలింగ్ కి గురయ్యాలా చేస్తున్నాయి..!