తాజాగా సమంత ఫాదర్ మరణించారు . ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది సమంత. " మనం మళ్ళీ కలిసే వరకు డాడ్" అంటూ గుండె ముక్కలైన ఎమోజిని షేర్ చేసింది . సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త సమంత ఫాన్స్ కు కన్నీరు తెప్పిస్తుంది . అయితే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా ఆమెకు కాల్ చేసింది లేదు . అడపాదడపా అఖిల్ ఆమెకు సపోర్ట్ చేస్తూ మెసేజ్ చేసాడు తప్పిస్తే ఎక్కడ కాల్ చేసి మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళకి విడాకుల తర్వాత ఫస్ట్ టైం సమంత కి కాల్ చేశాడట అఖిల్ . అది కూడా సమంత తండ్రి మరణించాడు అన్న వార్త తెలుసుకుని .
ఎప్పుడు మెసేజ్ చేసే అఖిల్ ఫస్ట్ టైం సమంత కు కాల్ చేసి మరి ధైర్యంగా ఉండాలి అంటూ సమంత తండ్రి మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారట . అంతేకాదు అఖిల్ సమంత తండ్రి అంత్యక్రియల్లో కూడా పాల్గొనాలి అంటూ అనుకున్నారట. కానీ నిశ్చితార్థమైన తర్వాత అలాంటి కార్యక్రమాలలో పాల్గొనకూడదు అంటూ కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారట. అయితే నాగచైతన్య ..సమంత తండ్రి మరణం పై స్పందిస్తాడా..? లేదా..? అన్నది అభిమానులకు ప్రశ్నార్ధకంగా మారింది .