ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ మళ్లీ మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ పిక్స్ కి చేరేలా చేసింది.  సాధారణంగా ఏ సినిమాలోని సీన్ అయినా సరే ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి డైరెక్టర్స్ కొత్తగా సరికొత్తగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇద్దరు డైరెక్టర్లు తెరకెక్కించిన సీన్ బన్నీ - రామ్ చరణ్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టేలా చేసింది అంటున్నారు జనాలు . మనకు తెలిసిందే రీసెంట్ గానే పుష్ప 2  ట్రైలర్ రిలీజ్ అయింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరియర్లో ఫస్ట్ టైం అమ్మవారి గెటప్ లో కనిపించబోతున్న సినిమా పుష్ప2  సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు బన్నీ అభిమానులు .


కచ్చితంగా 1500 కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ మూవీ అంటూ సుకుమార్ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఒక సీన్ మాత్రం బాగా హైలెట్గా మారింది . "మొగుడు పెళ్ళాం చెప్పిన మాట వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా.." అనే డైలాగ్ బాగా హైలైట్ గా మారింది.  అంతేకాదు శ్రీవల్లి కాళ్లతో పుష్పరాజ్ గడ్డం నిమురుతూ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్తాడు . అంత పెద్ద స్టార్ హీరో రష్మిక మందన్నా కాళ్లు పట్టుకోవడం ఏంటి ..? అంటూ జనాలు ఆశ్చర్యపోయారు .



అయితే ఇప్పుడు అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ అయినా కీయరా అద్వాని కాళ్లు పట్టుకున్న పిక్చర్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . కీయరా అద్వాని - రామ్ చరణ్ - శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన "హైరానా" అనే పాట రిలీజ్ అయింది . ఈ పాట వినడానికి బాగానే ఉన్నా చూసేదానికి రకరకాలుగా ఉంది అన్న ట్రోలింగ్ కూడా గురైంది . మరి ముఖ్యంగా ఏ స్టూడియోలో ఎడిటింగ్ చేయించావ్ శంకరా..? అంటూ కూడా దారుణంగా ట్రోలింగ్ గురి చేశారు ఆకతాయిలు .



అయితే ఈ సాంగ్లో ఒక షాట్ లో కీయరా అద్వానీ కాళ్ళను పట్టుకుంటాడు రామ్ చరణ్ . ఇంచుమించు పుష్ప2 ట్రైలర్ లో చూపించిన రష్మిక - అల్లు అర్జున్ స్టెప్ లానే ఉంటుంది . అయితే దీంతో సోషల్ మీడియాలో బాగా రాంచరణ్ ని ట్రోల్ చేస్తున్నారు. ఏంటి రాంచరణ్ కాపీ కొట్టావా..? గ్లోబల్ ఇమేజ్ అంటావు ఇదేనా నీ గ్లోబల్ ఇమేజ్..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . అయితే చరణ్ ఫాన్స్ సైతం అదే విధంగా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. ఈ స్టెప్ మీ బన్నీది కాదు అని.. గతంలో చాలామంది ఇలాంటి స్టెప్స్ క్రియేట్ చేశారు అని ..ఎర్ర చీర కట్టుకున్నదల్లా నా పెళ్ళామే అనకూడదు అని పాత సామెతలతో ఘాటుగా కౌంటర్స్ ఇచ్చి పుచ్చుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: