ఇక ఇప్పుడు రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న రాబోయే రోజుల్లో ఆ పైకి చూడటం ఖాయం .. గుంటూరు కారం చేస్తున్న సమయంలో మహేష్ కి ఉన్న ఈ నెక్స్ట్ రేంజ్ క్లారిటీ బాహుబలి చేస్తున్న అప్పుడు ప్రభాస్ కి లేదనే చెప్పాలి .. ఇంత పెద్ద ఆలోచన వచ్చేలోపే ఆ రేంజ్కి చేరుకున్నాడు డార్లింగ్. ఇదే క్రమంలో మహేష్ బాబుకు ఉన్న వెసులుబాటు ఎన్టీఆర్ కూడా ఉంది .. త్రిబుల్ ఆర్ తో పెరిగిన స్పాన్‌ని దేవర తో కంటిన్యూ చేసుకోగలిగారు ఎన్టీఆర్ .. ఇప్పుడు వార్ 2 తో మరో స్టెప్ ముందుకు వేశాడు .. ఆ తర్వాత వరుస బాలీవుడ్ సినిమాలు చేస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. ఈ అన్నిటి నడుమ ఒక్క క్షణం వెనక వేసి రీజనల్ సినిమా చేసే ఖాళీ వీరికి ఉంటుందా ?
రాజమౌళి తన కెరీర్ మంచి పిక్స్ లో ఉన్నప్పుడు కాస్త వెనక్కు వచ్చి మర్యాద రామన్న చేశారు .. అలాంటి సందర్భాలు మన స్టార్ హీరోలకు వస్తుందా? కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ తో సినిమా అంటే రీజినల్ లాంగ్వేజ్ అయితే ఓకే అన్నారు బన్నీ .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ ప్రాజెక్టులు తప్ప ఇలా లోకల్ ప్రాజెక్టుల వైపు చూసే వెసులుబాటు కనిపించడం లేదు .. పెరిగిన మార్కెట్ ని రేంజ్ ని దృష్టిలో పెట్టుకొని తన అడుగులు వేయాల్సిందే తప్ప ... చిన్న సినిమాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉండకపోవచ్చు అనే మాట బలంగా వినిపిస్తుంది.