కెరియర్ మొదట్లో ఓ స్టార్ హీరో సినిమాను మధ్యలో వదిలేసి వెళ్లిపోవాలని అనుకుందట . అందుకు కారణాన్ని కూడా ఆమె చెప్పకు వచ్చింది. త్రిష కు టాలీవుడ్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది వర్షం .. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - త్రిష జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇక ఈ సినిమాతో తెలుగులో టాప్ హీరోయిన్గా మారిపోయింది .. ఇక తన కెరియర్ లోనే ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని త్రిష ఎప్పుడూ చెబుతుంది .. అయితే తాజాగా ఆ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ .. తన కెరీర్లో అత్యంత ఎక్కువ ఇబ్బంది పెట్టిన సినిమా ఇదే అని కూడా ఆమె చెప్పింది. త్రిష కెరియర్ ఆరంభంలో వర్షం సినిమా కోసం చాలా కష్టపడిందని ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష తల్లి కూడా చెప్పుకొచ్చింది.
ఈ సినిమా కోసం దాదాపు 45 రోజులు వర్షంలో షూటింగ్ చేశారని దాంతో జలుబు , జ్వరంతో ఇబ్బంది పడిందని ఒకానొక దశలో ఈ సినిమా వదిలేసి వెళ్లిపోవాలని అనుకుందని కూడా చెప్పుకొచ్చింది. అయితే చివరి వరకు సినిమా ఫలితం చూశాక పడ్డ కష్టం అంతా మర్చిపోయిందని ఆమె తెలిపింది. తన తల్లి చెప్పిన మాటలు వంద శాతం నిజమని త్రిష వెల్లడించింది. వర్షం సినిమా అటు త్రిషకు.. ఇటు ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. ఈ చిత్రాన్ని దివంగత డైరెక్టర్ శోభన్ తెరకెక్కించగా.. టాలీవుడ్ హీరో గోపిచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి.