పెళ్లి అనేది జన్మజన్మల బంధం అని భారతీయులు బలంగా నమ్ముతారు .. ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకోవటం అనేది మన సంప్రదాయం. కానీ నార్త్‌లో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తుంది .. అక్కడ సెల‌బ్రిటీలు ఒకే వ్య‌క్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంటున్నారు .. అలాంటి కొన్ని జంటలు గురించి ఇక్కడ తెలుసుకుందాం . ముందుగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్‌ సింగ్ - దీపికా పదుకొనే 2018 లో పెళ్లిి చేసుకున్నారు .. ఈ జంట కూడా రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఇక దీపిక రన్వీర్ వారి  మతాల ప్రకారం కొంక‌ణి , సింధి సంప్రదాయాల్లో పెళ్లి చేసుకున్నారు
 

సన్నీ , బాబీ దేవోల్ , స‌వతి సోదరి ఈషా దే వోల్ జూన్ 12 భరత్ తఖ్తానిని పెళ్లి చేసుకుంది .. అయితే 2017 లో ఈషా భరత్ తఖ్తాని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈషా తన సీమంతం సందర్భంగా సింధు సంప్రదాయాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకుంది అలాగే నాగిని సీరియల్ , బ్రహ్మాస్త్ర సినిమాలతో ఫేమస్ అయిన మౌని రాయ్  2022 జనవరి 27న ఒకే రోజు  ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది.  మౌని రాయ్ 27 జనవరి 2022 తన బాయ్ ఫ్రెండ్ సూరజ్ నంబియార్ ని ఉదయం దక్షిణ భారత సంప్రదాయంలో సాయంత్రం బెంగాలీ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది .


బాలీవుడ్ స్టార్ నటడు గోవిందా 11 మార్చి 1987 లో సునీత అహుజాను పెళ్లి చేసుకున్నాడు ..  ఈ బాలీవుడ్ సీనియర్ హీరో తన పెళ్లిని చాలా కాలం పాటు రహస్యంగా ఉంచాడు .. గోవిందా తన 25వ  వివాహ వార్షికోత్సవం సందర్భంగా సునీత అహుజా ను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు .. త‌న‌ తల్లి నిర్మల దేవి కోరిక మేరకు తన భార్యని మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇక స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నతాషా స్టాంకోవిక్‌  జనవరి 1 2020 నిశ్చితార్థం చేసుకున్నారు .. కోవిడ్ సమయంలో 31 మే కోర్టులో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత హార్దిక్ - నతాషా ఫిబ్రవరి 14 2023 లో ఉదయపూర్ లో హిందూ - క్రైస్తవ సంప్రదాయాల్లో మళ్ళీ పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: