సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ముఖ్య పాత్రలో ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మించిన చిత్రం 'లాల్‌ సలామ్‌'. ఈ సినిమాలో మొదట రజినీకాంత్‌ ను కేవలం గెస్ట్‌ గానే నటింపజేయాలని భావించారు. కానీ ఆయన ఉంటేనే సినిమా కు మార్కెట్ ఉంటుంది, సినిమా వెయిట్ పెరగాలంటే, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలి అంటే ఆయన పాత్ర ఎక్కువ ఉండాలనే ఉద్దేశ్యంతో పాత్ర ను పెంచడం జరిగిందట. సినిమా ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రజినీకాంత్‌ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్న లాల్‌ సలామ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది.ఇది కాసేపు పక్కన పెడితే వసూళ్ల పరంగా ఎలాగో లాల్ సలాం చిత్రం రజినీకాంత్ పరువు తీసే రేంజ్ లో నిల్చింది, కనీసం సాటిలైట్, డిజిటల్ రైట్స్ అయినా డీసెంట్ స్థాయి రేట్లకు అమ్ముడుపోతుందని ట్రేడ్ ఆశించింది. కానీ అది కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసేందుకు ఒక్క ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ముందుకు రాలేదట.రజినీకాంత్ సినిమా అంటేనే విడుదలకు ముందు వందల కోట్ల రూపాయిల టేబుల్ ప్రాఫిట్ వస్తుంది. అన్ని రకాల రైట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతాయి. కానీ ఈ సినిమాకి అసలు హైప్ లేకపోవడంతో ఎవ్వరూ ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. ఇలా గతంలో అక్కినేని అఖిల్ నటించిన ‘ఏజెంట్’ చిత్రానికి జరిగింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ విడుదలకు ముందే సోనీ లైవ్ ఓటీటీ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఎందుకో నిర్మాతలతో ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో స్ట్రీమింగ్ ని రద్దు చేసుకున్నారు. మళ్ళీ ఆ సినిమాని ఏ ఓటీటీ సంస్థ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. అలాంటి అతి నీచమైన పరిస్థితి రజినీకాంత్ చిత్రానికి ఇప్పుడు రావడం శోచనీయం. ప్రస్తుతం రజినీకాంత్ ‘కూలీ’ చిత్రం లో నటిస్తున్నాడు. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా మన ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: