పుష్ప 2 సినిమా రిలీజ్‌ నేపథ్యంలో అల్లు అర్జున్‌ కు కొత్త సమస్యలు వచ్చాయి. పుష్ప 2 సినిమా రిలీజ్‌ నేపథ్యంలో అల్లు అర్జున్‌ ను అరెస్ట్‌ చేయాలని కొత్త డిమాండ్‌ తెరపైకి వస్తోంది. దీనికి కారణం సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటనే. ఈ తరుణంలోనే... అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని విద్యార్థి సంఘం PDSC డిమాండ్ చేయడం జరుగుతోంది. మహిళ ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయాలని ఓ ప్రకటన కూడా విడుదల చేసింది విద్యార్థి సంఘం PDSC.

లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది విద్యార్థి సంఘం PDSC.  సినిమా వినోదాన్ని పంచాలి కానీ విషాదాన్ని మిగిల్చకూడదని తెలిపింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అల్లు అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ PDSU డిమాండ్ చేస్తోంది. దీంతో పుష్ప 2 సినిమాతో పాటు అల్లు అర్జున్‌ కు కొత్త చిక్కులు వచ్చాయి. వాస్తవంగా... సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో ఓ మహిళ మృతి చెందింది.


పుష్ప 2 సినిమా రిలీజ్‌ అయిన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కి సలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. రాంనగర్ చెందిన రేవతి మృతి చెందగా ..కుమారుడు తేజ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది.  సంధ్య థియేటర్ లో పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చారు రేవతి కుటుంబ సభ్యులు.  అయితే... ఒక్కసారిగా అభిమానులు తోసుకొని రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇక దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది.

ఈ లాఠీ ఛార్జ్‌ నేపథ్యంలో తొక్కిసలాట పెరిగింది. దీంతో స్పృహ లేకుండా పడిపోయారు బాలుడు తేజ,  రేవతి.  వారిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అయితే.. ఈ సంఘటన నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చింది విద్యార్థి సంఘం PDSC.

మరింత సమాచారం తెలుసుకోండి: