కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువ .. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అనుకునంత స్థాయిలో మెప్పించ లేక పోయింది .. సూర్య 2022 నుంచి ప్రేక్షకుల ముందుకు రాలేదు .. అందుకే ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు .. అలాగే రిలీజ్ కి ముందు సినిమాపై భారీ హైప్‌ కూడా క్రియేట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవటంలో విఫలమైంది ..


దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెర‌కెక్కిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ మాత్రమే రాబట్టి 2024 లోనే అత్యంత భారీ డిజాస్టర్ సినిమాగా నిలిచింది. సూర్య హీరోగా తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో వచ్చిన కంగువ‌ ఓటిటిలో కూడా వచ్చేసింది .. థియేటర్లోకి కన్నా ఓటిటిలో ఈ సినిమాకి మంచి స్పందన వస్తుంది .. అయితే ఇప్పుడు కంగువ‌ సినిమాలో చాలామంది నటీనటులు నటీమణులు నటించారు .. ఈ సినిమాలో నటించిన ఓ నటి ఫోటో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . పైన ఫోటోలో ఉన్న నటిని గుర్తుపట్టారా ..


కంగువ సినిమాలో గిరిజన అమ్మాయిగా నటించింది .. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు .. అలాగే ఈ సినిమాలో ఎంతోమంది అగ్ర న‌టులు నటించారు .. పైన ఫోటోలో కనిపిస్తున్న నటి పేరు మీనా వాసు .. తెలుగులో పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది .. అలాగే ప‌లు సినిమాల్లో కూడా ఈమె నటించింది .. ఇక కంగువ‌ సినిమాలో ఈమె పాత్ర చిన్న పాత్ర అయినప్పటికీ తన నటనతో మెప్పించింది .. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్గా తన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సమందించిన ప‌లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమెనా కంగువలో నటించిన ముద్దుగుమ్మ అంటూ ఆమె ఫోటోలను వైరల్ చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: