టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దేశంలోనే హాట్ టాపిక్ గా మారారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం కోర్టు రిమాండ్ విధించడం అదేరోజు బెయిల్ రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంది. ఒక్కరోజు జైలు జీవితం బన్నీని మార్చేసిందని రాబోయే రోజుల్లో టార్గెట్ చేసిన వాళ్లకు బన్నీ చుక్కలు చూపించడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
బన్నీకి బలమైన బ్యాగ్రౌండ్ ఉంది. తన అరెస్ట్ కు కారణమేంటి? అసలేం జరిగింది? అనే విషయాలను తెలుసుకోవడం బన్నీకి కష్టం కాదు. బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండగా బన్నీ అరెస్ట్ ఆయనకు కెరీర్ పరంగా ప్లస్ అవుతుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మహిళ మృతి విషయంలో బన్నీ తప్పేం లేకపోయినా బన్నీని నిందిస్తున్నారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
 
బన్నీ అరెస్ట్ గురించి సీఎం రేవంత్ రియాక్షన్ కూడా నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. బన్నీ అరెస్ట్ తో అల్లు అర్జున్ కు కుటుంబం అంతా నిద్రలేని రాత్రులు గడిపిందని తెలుస్తోంది. బెయిల్ రాకుండా ఉండి ఉంటే సోమవారం వరకు బన్నీ జైలు జీవితం గడపాల్సిన పరిస్థితి ఉండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బన్నీని ఆలస్యంగా రిలీజ్ చేయడంపై బన్నీ న్యాయవాదులు ఫైర్ అయ్యారు.
 
తాము మరోసారి కోర్టును ఆశ్రయిస్తామని న్యాయవాదులు చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. బన్నీపై కేసు టాలీవుడ్ వర్గాల్లో సైతం ఒకింత సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. నేను లాను గౌరవిస్తానని బన్నీ పేర్కొన్నారు. జరిగిన ఘటన ఊహించని ఘటన అని బన్నీ కామెంట్లు చేశారు. బన్నీకే ఊహించని కష్టాలు వస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో అల్లు అర్జున్ ఆచితూచి అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.






మరింత సమాచారం తెలుసుకోండి: