2024 సంవత్సరం అల్లు అర్జున్ కు బ్యాడ్ ఇయరా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2024 సంవత్సరంలో బన్నీపై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయని సమాచారం అందుతోంది. ఈ హీరోపై నమోదైన కేసులు సైతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతున్నాయి. బన్నీ జైలు నుంచి రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తున్నారు. ఈ ఏడాది బన్నీపై మొత్తం మూడు కేసులు నమోదయ్యాయని సమాచారం అందుతోంది.
 
మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అల్లు అర్జున్ కలిసిన సమయంలో 144 సెక్షన్ కింద కేసు నమోదైంది. బన్నీ ఆర్మీ అని అభిమానుల గురించి చెబుతూ ఇండియన్ ఆర్మీని అవమానపరుస్తున్నారని మరో కేసు నమోదైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. బన్నీపై మూడు కేసులు నమోదయ్యాయని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
 
అల్లు అర్జున్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ , పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అల్లు అర్జున్ ను చూసి చిరంజీవి సతీమణి సురేఖ సైతం ఎమోషనల్ అయ్యారు. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉంది. సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో అల్లు అర్జున్ ఒకరు కావడం గమనార్హం.
 
బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా ఏకంగా 500 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. బన్నీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బన్నీని చూసి సతీమణి స్నేహారెడ్డి ఎమోషనల్ అయ్యారు. బన్నీ బెయిల్ పై బయటకు వచ్చినా ఈ కేసు వల్ల మరిన్ని సంవత్సరాల పాటు ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: