పుష్ప సినిమా పార్ట్ 2 విడుదల నేపథ్యంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై, జైలుకెళ్లిన అల్లు అర్జున్.. శనివారం ఉదయం సరిగ్గా 7 గంటల తరువాత విడుదలై బయటకి రావడం జరిగింది. ఆ వెంటనే గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ కి చేరుకున్న అల్లు అర్జున్ అక్కడినుండి నేరుగా తన మామ ఇంటికి వెళ్లారు. ఎందుకంటే నిన్న సాయంత్రం అల్లు అరెస్ట్ కాగా, అతని భార్య స్నేహ రెడ్డి కూతురు అర్హని వెంటబెట్టుకొని తండ్రి ఇంటికి వెళ్లి, రాత్రంతా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లి, వారిని కలుసుకొని అందరూ తరువాత జుబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇక ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్‌కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు.

ఆ తరువాత కుమారుడు, కుమార్తెను ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి అల్లు అరవింద్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో అతని భార్య స్నేహా అయితే బన్నీని ఆలింగనం చేసుకుని మరీ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తరువాత అక్కడికి విచ్చేసిన మీడియాతో అల్లు అర్జున్ మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ... తాను చట్టాన్ని గౌరవిస్తానని, అందుకే చట్టానికి కట్టుబడి జైలుకి వెళ్లానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి మరోసారి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని చెప్పుకొచ్చాడు బన్ని.

ఆ తరువాత ఆ ఘటన విషయంలో వివరణ ఇచ్చుకొచ్చారు అల్లు అర్జున్. సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఈ ఘటన జరిగిందన్నారు. దాదాపు 20 ఏళ్ళుగా అదే థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నానని, ఎప్పుడూ ఇలా జరగలేదు. కానీ బాధిత కుటుంబానికి జరిగిన నష్టం అయితే పూడ్చలేనిది. వారికి ఇద్దరూ పిల్లలు. వారి అబ్బాయి కూడా దారుణ గాయాలపాలయ్యారు. అతను నా ఫ్యాన్ అని విన్నాను. వారి కుటుంబ బాధ్యత ఇక నాదే. ఇకనుండి ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాను... అని చెప్పుకొచ్చారు బన్నీ.

మరింత సమాచారం తెలుసుకోండి: