ఇప్పటికే ఈ సినిమా కోసం 11 కేజీల బరువు తగ్గాడు మహేష్ బాబు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఈ సినిమా కోసం ఏఐ టెక్నాలజీ కూడా బాగా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాడు రాజమౌళి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రాజమౌళి - మహేష్ బాబు సినిమాకి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. విక్రమార్కుడు సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్ లో రవితేజను చూపించి శభాష్ అనిపించుకున్నాడు రాజమౌళి .అదేవిధంగా బాహుబలి సినిమాలో ప్రభాస్ ని డ్యూయల్ క్యారెక్టర్ లో చూపించి వారేవా అనిపించాడు.
కాగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు తో తెరకెక్కించే సినిమాను కూడా ఇలాగే డిజైన్ చేసుకుంటున్నాడట . మహేష్ బాబు ని ఈ సినిమాలో డ్యూయల్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట. అదే నిజమైతే మాత్రం ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క . ముందుగానే రాజమౌళి సినిమా అంటే హిట్ పేరు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఓ జంగల్ అడ్వెంచర్స్ మూవీని తెరకెక్కించబోతున్నాడు రాజమౌళి అని తెలియడంతో మరో ఆస్కార్ అవార్డు పక్క అంటున్నారు జనాలు . సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!