పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఎప్పుడు ఏ డైరెక్టర్‌తో సినిమా అనౌన్స్ చేస్తాడో అర్థం కావడం లేదు. అతను ఒక్క సినిమా తీసిన దర్శకుడు అయినా సరే.. కథ నచ్చితే వెంటనే అవకాశం ఇచ్చేస్తున్నాడు. బాహుబలి వంటి సినిమా తర్వాత సుజీత్‌తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ చేశాడు ప్రభాస్. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్‌తో సలార్, నాగ్ అశ్విన్‌తో కల్కి సినిమాలు తీశాడు. ప్రస్తుతం మారుతితో రాజాసాబ్‌, హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ కమిట్ అయ్యాడు. ఎలాగూ సలార్ 2, కల్కి 2 లైన్లో ఉండనే ఉన్నాయి. మరి నెక్స్ట్ ప్రభాస్ లిస్ట్‌లో ఉన్న దర్శకుడు ఎవరు అంటే.. ఊహించని పేరు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతనే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ప్రశాంత్ ప్రస్తుతం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఙ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో సినిమా ఈమధ్యే పట్టాలెక్కాల్సింది. కానీ ఆగిపోయింది. ఈ ప్రాజెక్ట్ ముందుకు కదిలే ప్రసక్తే లేదన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్‌.ఈ సినిమా ఎలాగైనా మొదలెట్టాలని బాలకృష్ణ విశ్వ ప్రయత్నాలూ చేశారని, కానీ సాధ్యం కాలేదని తెలుస్తోంది. దాంతో.. ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా పనుల్లో పడిపోయారు. ప్రభాస్ - ప్రశాంత్ వర్మ కాంబోలో ఓ సినిమా వస్తుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. మోక్షు సినిమా సైడ్ అయిపోవడంతో, ఇప్పుడు ప్రభాస్ సినిమా పనులు స్పీడప్ అయ్యాయి.జనవరిలో ప్రభాస్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతోందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో  ఈ క్రేజీ కలయిక కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ప్రశాంత్ వర్మ చెప్పిన ఆ బిగ్ స్టార్ ప్రభాసేనా కాదా అనేది వేచి చూడాలి. ఇక ప్రస్తుతం తాను కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టితో “జై హనుమాన్” అనే సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: