తెలుగు సినిమా రేంజ్ ని మరొకసారి పెంచిన హీరో అల్లు అర్జున్.. పుష్ప 2 చిత్రంతో భారీ క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా విడుదల సందర్భంగా కుటుంబంతో అభిమానులతో కలిసి సినిమా చూడాలని సంధ్య థియేటర్ కి వెళ్లారు. అక్కడ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ సైతం అరెస్టు చేశారు. నిన్నటి రోజున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి కూడా తీసుకువెళ్లి నాంపల్లి కోర్టుకి హాజరు పరచడమే కాకుండా చంచల్గూడా జైలుకు కూడా పంపించారు.. ఆ తర్వాత హైకోర్టు అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయడం జరిగింది.


ఈరోజు ఉదయమే అల్లు అర్జున్ బయటికి వచ్చారు అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఒక ఎపిసోడ్ నాటకం జరిగిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.. తెర వెనక కూడా చాలామంది కీలకమైన పాత్ర పోషించినట్లుగా టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ ని తన ఇంటిదగ్గర నుండి అరెస్టు చేసిన తర్వాత బాలయ్య అల్లు అర్జున్ తండ్రికి ఫోన్ చేసి మరి ధైర్యం చెప్పడమే కాకుండా నిర్మాత నాగవంశీని కూడా అల్లు అర్జున్ ఉన్నచోటకి పంపించారట.


అలాగే అల్లు అరవింద్ తో కాంటాక్ట్ లోనే ఉంటూ ఎప్పటికప్పుడు పలు విషయాలను తెలుసుకుంటూనే ఉన్నారట.. అంతేకాకుండా బెయిల్ విషయంలో అల్లు అరవింద్ టెన్షన్ పడుతున్న సమయంలో ఈ విషయాన్ని గమనించి నాగ వంశి బాలయ్య దృష్టికి తీసుకు వెళ్లడంతో.. ఈ విషయంపై అల్లు అరవింద్ కు బాలయ్య ఫోన్ చేసి మరి అన్ని విషయాలను తెలుసుకొని వెంటనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడినట్లు సమాచారం. ప్రభుత్వం చేస్తున్న పని సరైనదే అని కానీ అల్లు అర్జున్ బెయిల్  విషయం పైన ప్రభుత్వం నుంచి సహకారం కోరినట్లుగా సమాచారం. దీంతో సీఎం రేవంత్ రెడ్డి పిపికి సంబంధించి ఆదేశాలను జారీ చేసి.. బెయిల్  ఇప్పించినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీంతో అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పైన ఎలాంటి మాటలు మాట్లాడలేదు..


బాలయ్య, అల్లు అరవింద్ కి ఆహా ఓటిటి ప్లాట్ఫారం నుంచి మంచి బాండింగ్ ఏర్పడడంతో స్నేహితులయ్యారట.. దీంతో బాలయ్య తనకు స్నేహితుడు అయిన అల్లు అరవింద్ అలా ఉండడం చూసి తట్టుకోలేక ఇలాంటి పని చేసినట్లు సమాచారం దీంతో ఈ విషయం విన్న అభిమానులు బాలయ్య చేసిన పనికి శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం అయితే వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: