రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనేవాడు హాట్ టాపిక్ గా మారాడనే చెప్పుకోవచ్చు. ఓ పక్క అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఇండియా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంటే, తెలుగు స్టేట్స్‌లో మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ వార్త మాత్రం ట్రెండింగులో ఉంది. విషయం ఏమిటంటే... పుష్ప 2 విడుదలకి ముందు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాద ఘటనలో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో హడావుడి మొదలైంది. అయితే అల్లు అర్జున్ పోలీసులు స్టేషన్ కి రమ్మనడంతో చాలా కూల్ గా పోలీసులతో వెళ్ళిపోయాడు. కానీ అక్కడి నుండే మొదలైంది అసలు రచ్చ.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ సహా మెగా కుటుంబం కూడా బన్నీని ఎలాగైనా బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ గ్యాప్ లోనే అల్లు అర్జున్ 14 రోజులు బయటకి రాడు! అంటూ షాకింగ్ వార్తలు మీడియాలో రాగా అల్లు అర్జున్ విషయం జనాలను మరింత టెన్షన్ పెట్టింది. కాగా ఎట్టకేలకి అల్లు అర్జున్‌కి ఈరోజే మధ్యంతర బెయిల్ రాగా అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే బయటకు వచ్చేసాడు. అయితే ఇంత తక్కువ సమయంలోనే ఈ సీరియస్ కేసులో అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించిన హీరోపై అల్లు అర్జున్ సహా మెగా అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

కాగా అల్లు అర్జున్ బయటకు రావడానికి కారణం మరెవరో కాదట! టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, లాయర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి అని అందరూ అంటున్నారు. ఇతడే అల్లు అర్జున్ కి బెయిలు ఇప్పించడంలో చాలా కీ రోల్ ప్లే చేశాడని అంటున్నారు. విషయం ఏమిటంటే... అల్లు అర్జున్ కేసుని కోర్ట్‌లో చాలా చాకచక్యంగా వాదించి సాయంత్రానికి బెయిలు వచ్చేలా చేశారట. ఇతని విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే తాను మెగాస్టార్ చిరంజీవికి ఎంతో దగ్గర స్నేహితుడు అట. మెగాస్టార్ చిరంజీవితో "ఆచార్య" సినిమా చేసింది కూడా ఈయనే. ఇలా మెగాస్టార్ వెనకుండి చొరవ తీసుకోవడంతోనే ఇంత త్వరగా అల్లు అర్జున్ బయటకి వచ్చేలా సెట్ చేశాడని ఇపుడు సినీ వర్గాల్లో టాక్ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: