నయనతార విజ్ఞేశ్ శివన్ తమిళ, తెలుగు ఇండస్ట్రీలో ఈ జంట తెలియని వారు ఉండరు. కొన్నాళ్ళ పాటు లవ్ లో ఉండి  పెళ్లి ద్వారా ఒకటైన ఈ జంట ఇద్దరు  పిల్లలకు జన్మనిచ్చారు. అలా ఎంతో ఆనందంగా సాగిస్తున్న వీరి జీవితంలో, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా  వాటిని అధిగమిస్తూ సర్దుకొని ముందుకు వెళ్తున్నారు.  అయినా వీరి సంసార జీవితంలో ఎవరో ఒకరు వేలు పెడుతూనే ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో  నయనతార తాజాగా బాధపడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. తనవల్ల విగ్నేష్ శివన్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తన జీవితంలోకి నేను వెళ్లకపోయి ఉంటే బాగుండేదని చెప్పకొచ్చింది. మరి ఆమె ఎందుకు అంటుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం..  నేను విగ్నేష్ తో జీవితాన్ని పంచుకోకపోయి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు అనిపిస్తోంది. 

తనను ఈ రిలేషన్ షిప్ లోకి లాగినందుకు గిల్టీగా అనిపిస్తుంది. విగ్నేష్ ఎంతో మంచివాడు.  ఆయనంత మంచి దాన్ని నేను కాదు. ఆయన డైరెక్టర్ గా, రచయితగా, గేయ రచయితగా ఎంతో ఫేమస్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆయన జీవితంలోకి నేను వచ్చేసరికి, చాలామంది ఆయనను మర్చిపోయారు.  విగ్నేష్ ను మరిచిపోయి నయనతారను మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు.. నేను ఆయన లైఫ్ లోకి రాకుంటే ఆయన తన సొంత టాలెంట్ నిరూపించుకొని ఇప్పటికే స్టార్ అయ్యేవాడు. చాలామంది సక్సెస్ అయిన మనుషులు తమతో సమానంగా సంపాదించే వారిని మాత్రమే కోరుకుంటారు..  కానీ అలా కోరుకుంటే సరైన ప్రేమను అందుకోలేరు.

మీరు సక్సెస్ అయితే, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వారిని ఆదుకొని వాళ్ళు సక్సెస్ అయ్యేలా చేయండి అప్పుడు మీరు వారి నుంచి అద్భుతమైన ప్రేమను అందుకోగలుగుతారు  అంటూ చెప్పుకొచ్చింది. నేను సక్సెస్ అయిన హీరోయిన్ ను కాబట్టి, నేను విగ్నేష్ శివాన్ ను చేసుకోవడం వల్ల చాలామంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఎక్కువమంది ఆయనను చులకన చేస్తూ మాట్లాడుతున్నారు. ఆయనను అలా  చేయడం  నన్ను ఎంతో బాధ పెడుతుంది అంటూ  చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్  గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: