స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబరు 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పుడు శ్రీ తేజ్ కు ICU లో వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది. శ్రీ తేజ్ ను కాపాడడానికి వైద్యులు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అతను కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ఇకపోతే తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ భారతదేశంలో టాలీవుడ్ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ క్రమంలో పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి.. ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. తర్వాత ఆయనకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపుల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
నేడు మద్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వచ్చారు. అనంతరం ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యాలు చేశారు. తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి సానుభూతి తెలిజేస్తున్నాను అని అన్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని అల్లు అర్జున్ తెలిపారు. గతంలో ఎప్పుడు ఇలా జరగలేదని వ్యాఖ్యనించారు. ఏదేమైనా ఆ ఫ్యామిలీకి అన్నివిధాలా అండగా ఉంటా బన్నీ భరోసానిచ్చారు.