ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. బన్నీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో విజయాలను అందుకోవడం కెరీర్ పరంగా ప్లస్ అయింది. బన్నీ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్నేహారెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య బంధుత్వం ఉందనే సంగతి తెలిసిందే. అయితే బన్నీ భార్య ఆస్తుల విలువ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
బన్నీ భార్య ఆస్తుల విలువ ఏకంగా 42 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది. స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. 2011 సంవత్సరంలో బన్నీ స్నేహారెడ్డి పెళ్లి జరగగా వీళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహారెడ్డికి పలు వ్యాపారాలు ఉండగా సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా కూడ ఆమె మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.
 
పుష్ప ది రూల్ సక్సెస్ అనంతరం ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ 2000 కోట్ల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి హిట్ గా నిలిచింది. మాస్ ఏరియాలలో ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొడుతోంది.
 
పుష్ప ది రూల్ టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఆర్.ఆర్.ఆర్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్లను ఈ సినిమా సులువుగానే బ్రేక్ చేసింది. పుష్ప ది రూల్ కలెక్షన్ల విషయంలో నిర్మాతలు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతూ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నారు. టాలీవుడ్ హీరోల రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. స్నేహారెడ్డికి క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: