ఈ రోజుల్లో సినిమా ఎలా తీసాము అనే దాని కంటే కూడా సినిమాను ఏ విధంగా ప్రమోట్ చేసాము అనేదే చాలా ముఖ్యం. సినిమాను గొప్పగా తీసిన కూడా సరైన పద్ధతిలో ప్రమోషన్లు చేయనట్లయితే ఆ సినిమా జనాల్లోకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కరెక్ట్ పద్ధతిలో ప్రమోషన్లు చేస్తే సినిమా విడుదలకు ముందే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. వాటి ద్వారా సినిమా కనుక బాగున్నట్లయితే అద్భుతమైన కలెక్షన్లు వస్తూ ఉంటాయి. అందుకే కొంతవ్మంది దర్శకులు , నిర్మాతలు , హీరోలు , సినిమాలను తెరకెక్కించడంలో ఏ స్థాయిలో శ్రద్ధ పెడతారో సినిమాను ప్రచారం చేయడంలో కూడా అంతే శ్రద్ధ పెడుతూ ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం మల్లాడి వశిష్ట , చిరంజీవి హీరోగా విశ్వంభర అనే సినిమాను రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇది ఇలా ఉంటే నిన్న చిరంజీవి పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం వారు టీజర్ ను విడుదల చేస్తారు అని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ బృందం వారు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయలేదు. ఇకపోతే చిరంజీవి పుట్టిన రోజు కు ముందే వశిష్ట , చిరంజీవి పుట్టిన రోజుకు విశ్వంబర మూవీ నుండి టీజర్ ను విడుదల చేయడం లేదు.

ఎందుకు అంటే మేము ముందే టీజర్ ని ఎప్పుడు విడుదల చేయాలి , పాటలను ఎప్పుడు విడుదల చేయాలి , అసలు ప్రచారాలను ఎలా చేయాలి అనే దానిపై ఒక పక్క ప్లానింగ్ లో ఉన్నాము. అలా దానిని నిర్వహిస్తూ వస్తాము. ఒక సారి టీజర్ ను విడుదల చేసి వదిలి వెయ్యము. వరుసగా ప్రచారాలను చేసే విధంగా ప్లాన్ చేశాము. అందుకే టీజర్ విడుదల అయ్యాక వరుసగా అప్డేట్లు వస్తూ ఉంటాయి అని వశిష్ట తాజాగా చెప్పుకొచ్చాడు. ఇలా విశ్వంభర మూవీ విషయంలో ఈ మూవీ దర్శకుడు వశిష్ట పక్కా ప్లానింగ్ తో ఈ మూవీ ప్రమోషన్లను చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: