ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న చిత్రంగా ‘బాహుబలి-2’ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ రిలీజ్ కోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు, సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్న ఈ మూవీపై ప్రమోషన్ కోసం ‘బాహుబలి-2’ నిర్మాతలు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.
దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే…‘బాహుబలి-2’ చిత్రం విడుదలకు మరికొన్ని రోజులే ఉన్నాయి. దీంతో‘బాహుబలి-2’ చిత్ర టీమ్ ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది. సినిమా మూడు భాషలలో రిలీజ్ అవుతుంది. తెలుగు,తమిళం, హిందీల్లో సమాన స్థాయిలో ప్రమోషన్లను ‘బాహుబలి-2’ ప్లాన్ చేశారు. ఇప్పటికే ‘బాహుబలి-2’ ప్రి రిలీజ్ ఫంక్షన్, అలాగే మిగతా భాషల్లో ఆడియో వేడుకను భారీ స్థాయిలో నిర్వహించటం జరిగింది.
‘బాహుబలి-2’ పాటలకు భారీ ప్రచారం జరుగుతుంది. అయితే ఇంతలా ప్రచారం జరగటానికి ‘బాహుబలి-2’ కోసం నిర్మాతలు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవుతారు. నిజం చెప్పాలంటే బాహుబలి మొదటి పార్ట్ కంటే ‘బాహుబలి-2’ కోసం నిర్మాతలు తక్కువే ఖర్చు పెడుతున్నారు. బాహుబలి మొదటి భాగానికి చేసిన ప్రమోషన్ ఖర్చులో సగం కూడ నిర్మాతలు పెట్టుకోవటం లేదు. బాహుబలి మూవీ సాధించిన సక్సెస్ కారణంగా…ఇప్పుడు ‘బాహుబలి-2’ కి ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది.
బాహుబలి ప్రమోషన్ కోసం దాదాపు 2 కోట్ల రూపాయలుగా ఖర్చు చేశారు. ఇప్పుడు ‘బాహుబలి-2’కోసం కోటి రూపాయల కంటే తక్కువే ఖర్చు చేస్తున్నారు. యూత్ అంతా ఈ మూవీ కోసం ఎదురుచూడటమే కాకుండా మౌత్ టాక్ తో స్ప్రెడ్ చేస్తుంది. దీని కారణంగా ‘బాహుబలి-2’ కి ప్రమోషన్ అంతా మౌత్ టాక్ అని అంటున్నారు. ఇక అన్ని రకాల మీడియా సంస్థలు ‘బాహుబలి-2’ కి ఉచిత ప్రమోషన్ ని ఇవ్వటంతో ఖర్చు చాలా వరకూ తగ్గిందని చెప్పవచ్చు.