ఐషా శర్మ.. తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు ఇది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'చిరుత' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హీరోయిన్ నేహా శర్మ చెల్లెలే ఈ ఐషా శర్మ. తన సిస్టర్ లాగే మోడలింగ్ రంగం నుండి సినీ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.
2018లో జాన్ అబ్రహం హీరోగా విడుదలైన 'సత్యమేవ జయతే' సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఆ సినిమా మోస్తరు విజయం అందుకుంది కానీ ఐషాకు మాత్రం అవకాశాలు తీసుకురాలేక పోయింది.
ఇక అమ్మడు అవకాశాలు లేక మోడలింగ్ లోనే కొనసాగుతోంది. అయితే ఇటీవల ఓ స్టార్ హీరో సరసన సైడ్ హీరోయిన్ గా చేయమని అవకాశం ఇస్తే ఈ భామ ఒప్పుకోలేదట. గతంలో తెలుగులో రామ్ సరసన అవకాశం మిస్ చేసుకోవడమే గాక పూరీ డైరెక్షన్ లో వచ్చిన 'రోగ్' మూవీలో నటించే అవకాశం కూడా మిస్ చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమ్మడి అందాలకు ఫాలోయింగ్ మాములుగా లేదు.
సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేస్తూ.. అందాల ఆరబోతతో ఐషా అభిమానులను మాత్రం హ్యాపీగా తన అందాల గుప్పిట్లో ఉంచుకుంటోంది. అలంకరణ తక్కువ చేసుకోవడం అమ్మడి ప్రత్యేకత. ఐషా ఇంస్టాగ్రామ్ ఎల్లప్పుడూ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇండియన్ టాప్ మోడల్స్ లో ఒకరిగా ఐషా పేరు పొందుతోంది.
నాజూకుగా ఐషా అందాలను ప్రదర్శనగా నిలిపింది. అందాల ఆరబోతలో మా అక్కకి నేనేం తక్కువ కాదంటూ రెచ్చిపోతోంది. ఇంకేముంది ఆమె ఫాల్లోవెర్స్ కాస్త అమ్మడి అందాలను చూసి నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి మరి ఐషా సోయగాలు. మెన్ ఇన్ బ్లాక్ లాగా.. విమెన్ ఇన్ బ్లాక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి ఫోటో షూట్స్, పోజులు ఐషాకి కొత్తేమి కాదు. చూడగానే ఆకట్టుకునే అందం ఐషా సొంతం అని చెప్పాలి. కానీ అవకాశాలు వస్తే మాత్రం స్టార్ హీరోలతో నటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి అందాల ఆరబోతలో పీయచ్ డీ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఈ ఫోటోలు చూసైనా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.