దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో కూడా కూడా కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. ఇతర దేశాలు కరోనాను కట్టడి చేయడానికి భారత్ సహాయం కోరుతున్నాయి. తాజాగా భారత్ 35 లక్షల హైడ్రాక్సీ క్లోరోకిన్ మాత్రలను అమెరికాకు పంపి అగ్ర రాజ్యం పట్ల కృతజ్ఞత ప్రదర్శించింది. 
 
అమెరికా రక్షణ ఒప్పందాల్లో భాగంగా భారత్ కు హర్పూన్ బ్లాక్-2 ఎయిర్ లాంచ్డ్ క్షిపణులు, ఎంకే-54 టార్పెడోలు విక్రయించడానికి అంగీకారం తెలిపింది. అమెరికా రక్షణ శాఖ తమ జాతీయ చట్టసభలకు ఈ వ్యాపార ఒప్పందం విలువ 155 మిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపింది. భారత ప్రభుత్వం గతంలోనే ఈ రెండు ఆయుధాలను అందించాలని అమెరికాకు విజ్ఞప్తి చేసింది. అప్పట్లో అమెరికా భారత్ ప్రతిపాదనలను పరిశీలనలో ఉంచింది. 
 
అయితే అమెరికాలో కరోనా వేగంగా విజృంభిస్తున్న సమయంలో భారత్ వాణిజ్య ఆంక్షలను సడలించి మరీ హైడ్రాక్సీ క్లిరోక్విన్ ను ఎగుమతి చేసింది. అమెరికా అందుకు ప్రతిఫలంగా రక్షణ ఒప్పందాన్ని వెంటనే పట్టాలెక్కించింది. భారత్ పి-81 విమానానికి హర్పూన్ మిసైళ్లను అమర్చనుంది. ఈ మిసైళ్లు నావికాదళ సామర్థ్యాన్ని మరింత ఇమడింపజేయనున్నాయి. 
 
ఎంకే-54 టార్పెడోలు తక్కువ బరువు ఉండడంతో అత్యంత వేగంతో ప్రయాణించి జలాంతర్గాములను వెతికి మరీ వేటాడతాయి. చైనా దేశం వియత్నాం దగ్గర ఉన్న దీవులను కబ్జా చేసి భారీ ఎత్తున స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో భారత్ కు ఎంకే-54 టార్పెడోలు ప్రత్యర్థి యుద్ధ నౌకలను ధ్వంసం చేయడంతో టార్పెడోలు సహాయపడతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: