సొంత ఊరిని..పుట్టిన గడ్డని మర్చిపోయే వాళ్ళు అసలు ఉండరు. వేరే వేరే పనుల దృష్ట్యా బిజే బిజీ లైఫ్ లతో గడుపుతున్నా ఎదో ఒక రూపంలో సొంత దేశానికి సాయం చేస్తూనే ఉంటారు. కానీ భారత్ కి చెందిన ముగ్గురు శాస్త్ర వేత్తలు భారత్ కి దక్కాల్సిన ఘన కీర్తిని రానివ్వకుండా అడ్డుపడ్డారు.  వాస్తవాలు దాచిపెట్టి మరీ ఇండియా కి వచ్చే విశిష్టమైన గౌరవాన్ని దక్కకుండా చేశారు. కరోనా వైరస్ సోకిన రోగులకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడితో గుండెకి సంభందిన వ్యాధులు వస్తున్నాయని ఓ ప్రచారాన్ని కల్పించి దానిని ఆమోదించి ఆ సిద్దాంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చి మానవాళికి, భారత్ కి తీరని ద్రోహం చేశారు.

 

ఈ దారుణమైన చర్యలకి ఒడిగట్టిన శాస్త్రవేత్తలు నలుగురు కాగా వారిలో ముగ్గురు భారత సంతతికి చెందిన వారు మరొకడు అమెరికాకి చెందిన శాస్త్రవేత్త. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది రోగులని కాపాడకుండా చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారత్ కి మంచి పేరు రాకూడదనే కుట్రలో భాగంగా ఈ దారుణానికి పూనుకున్నారని తెలుస్తోంది. ఒక వేళ  హైడ్రాక్సీ క్లోరోక్విన్ రోగులపై వాడిఉంటే తప్పకుండా లక్షలాది మంది ప్రాణాలు నిలిచేవని అంటున్నారు. భారత్ ఓ వెలుగు వెలిగేదని ఈ గౌరవం భారత్ కి దక్కకుండా చేశారని మండిపడుతున్నారు.

 

ప్రపంచ ప్రఖ్యాత లాన్సెట్ పత్రిక లో ప్రచురించ బడిన వార్త ప్రకారం హైడ్రాక్సీ క్లోరోక్విన్  వాడకాన్ని ఆపేశారు. రోగులకి ఈ మందుని ఇవ్వడం లేదని కధనం ప్రచురితం అయ్యింది. ఈ విషయంపై సుమారు 180 మంది నిపుణులైన వైద్యులు సదరు వార్తని ప్రచురించిన పత్రిక ని నివేదికకి సంభందిన డేటాని ఇవ్వమని అడిగారు. దాంతో పత్రికా యాజమాన్యం నివేదిక అందించిన శాస్త్రవేత్తలని డేటా అడిగినా వారు అందించలేక పోయారు. దాంతో ఈ రిపోర్ట్ అందించి విలేఖరిని యాజమాన్యం తొలగించింది కానీ జరగాల్సిన అనర్ధం అప్పటికే జరిగిపోయింది. దాంతో శాస్త్రవేత్తలు తమ తప్పుని ఒప్పుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయితే వీరు ఈ రకమైన ప్రకటన చేయడం వెనుక ఎవరి ప్రభావమో తప్పకుండా ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: