ఒకవైపు యుద్ధం జరుగుతుంటే.. అతను మాత్రం పెళ్లి చేసుకున్నాడు?
ఇలా పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఓ జంట మాత్రం పెళ్లి బాజాలు మోగించింది. యుద్ధ విమానాల సైరన్ మోతనే తమ పెళ్లి బాజాలు గా భావించి చివరికి ఓ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. పరిస్థితులు బాగుంటే అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకోవాలనుకున్న వారు.. ఇక అనుకోని విధంగా యుద్ధ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో ఇక కేవలం కొంతమంది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య సాదాసీదాగా పెళ్లి చేసుకున్నారు ఇక్కడ ఒక జంట. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అసలు ప్రాణాలతో ఉంటామో లేదో తెలియని పరిస్థితుల్లో కూడా తమ పెళ్లిని యుద్ధ సమయంలోనే చేసుకోవాలని ఇక్కడ ఒక జంట నిర్ణయించుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
తన ఫియాన్సీ శివాటో స్లావ్ తో మే 6వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలు కావడంతో ఎక్కడ ఏ బాంబ్ పడుతుందో అని ఎప్పుడు ప్రాణం పోతుందా అన్న భయాందోళన ఉంది. తాము కూడా ఈ యుద్ధంలో చనిపోతే ఎలా అని అనుకుంది ఇక్కడ ఒక జంట. ఇక ఇలా ప్రాణాలు పోవడానికి ముందే పెళ్లి బంధంతో ఒక్కటి కావాలి అనుకున్నాము అంటూ చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే చర్చ్ లో కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య రింగులు మార్చుకొని ప్రమాణాలతో ఒక్కటైన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.