పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు జరిమానా.. ఎందుకో తెలుసా?
ఈ క్రమంలోనే కాస్త ప్రస్టేషన్ లోకి వెళ్ళిపోయారు ఇమ్రాన్ ఖాన్. ఇక ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని విధంగా మారిపోయింది. మొన్నటికి మొన్న ఎప్పుడూ భారత్ పై విమర్శలు గుప్పిస్తూ ఉండే ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పౌరుల కోసం భారతీయ ఎంతవరకైన తెగిస్తూ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక నిన్నటికి నిన్న కాశ్మీర్ అంశంపై స్పందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే భారత ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు చేసింది అని అన్నారు.
ఇక ఇప్పుడు మరోసారి ఒక సభలో పాల్గొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోయారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంది అని తెలిసినప్పటికీ ఇబ్బందులు ఉల్లంఘించారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దీంతో ఆయనకు ఆ దేశ ఎన్నికల సంఘం జరిమానా విధించింది. ఇటీవలే స్వాత్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ఇమ్రాన్‌ఖాన్ ఇక్కడ ప్రసంగించారు. అయితే ఇలా చేయడం వల్ల ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి నట్లయింది.దీంతో ఆయనకు 50 వేల జరిమానా విధించింది ఎన్నికల సంఘం. అక్కడ స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఇక స్వాత్ సభలో పాల్గొనవద్దని బహిరంగ సభలు నిర్వహించవద్దని ఇమ్రాన్ ఖాన్‌కు హెచ్చరించింది ఎన్నికల సంఘం. అయినప్పటికీ ఎన్నికల సంఘం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించారు ఇమ్రాన్ ఖాన్.