ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఇట్టే తెలుసుకోగలుగుతున్నారు. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు కనీసం కలలో కూడా ఊహించని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక అసాధారణ ఘటన గురించే.


సాధారణంగా ఒక మహిళ నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తుంది అన్న విషయం అందరికీ తెలుసు. ఇలా నిమిషాల వ్యవధిలో పుట్టిన పిల్లలను కవలలు అని పిలవడం కూడా చేస్తూ ఉంటారు. అయితే కవలలుగా పుట్టిన వారు ఒకే రకమైన పోలికలతో ఉండడం కూడా చూస్తూ ఉంటాం. సాధారణంగా కవలలు అంటే కేవలం ఇలా నిమిషాల వ్యవధిలోనే పుట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఏకంగా ఒక బిడ్డ పుట్టి చనిపోయిన 22 రోజుల తర్వాత మరో శిశువుకు జన్మనిచ్చింది మహిళ. ఇదేలా సాధ్యమైంది అంటూ ప్రతి ఒక్కరు కూడా షాక్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఇంగ్లాండులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 డ్యూయల్ అనే మహిళకు ఒక బిడ్డ పుట్టి చనిపోయిన 22 రోజులకి మరో శిశువు జన్మించింది. అయితే ఇది అరుదైన సంఘటన అని డాక్టర్లు సైతం చెప్పుకొచ్చారు. కవలలు ఇంత గ్యాప్ లో పుట్టటం తమ కెరియర్ లోనే ఎప్పుడూ చూడలేదని వైద్యులు తెలిపారు. బొడ్డుతాడులో రక్తం గడ్డకట్టి మొదటి శిశువు చనిపోయింది. తర్వాత నొప్పులు రాకపోవడంతో డాక్టర్లు ఇంటికి పంపించేశారు. ఇక 22 రోజుల తర్వాత డబ్బులు రావడంతో వెంటనే మహిళ ను ఆసుపత్రికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. ఇక ఆపరేషన్ చేసి 22 రోజుల తర్వాత బిడ్డను బయటకు తీసారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: