తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విట్టర్ వేదికగా మెగాస్టర్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నటనా కౌశలంతో ప్రేక్షకులను మరింతగా అలరించాలని ఆశిస్తున్నట్టు తమిళసై పేర్కొన్నారు. ఆయనకు భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కెరీర్లో మరిన్ని గొప్ప మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు గవర్నర్ తమిళిసై.