పంజాబ్లో సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బీఎస్ఎఫ్ దళాలు కాల్చి చంపాయి. తార్న్ తరన్ జిల్లా ఖేమ్కరన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఐదుగురు చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి జవాన్లపై వారు కాల్పులు జరపగా.. బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చొరబాటుదారులు హతమయ్యారు.