శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ కేంద్రం వద్ద ప్రమాద స్థలిని పరిశీలించేందుకు వెళ్తున్న రేవంత్‌రెడ్డి, మల్లు రవిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ‘‘ప్రజాప్రతినిధులుగా ఘటనాస్థలిని పరిశీలించడం, బాధితులను పరామర్శించడం తమ బాధ్యత అని.. కానీ తెలంగాణ ప్రభుత్వం రాక్షసంగా ప్రవర్తిస్తోందన్నారు . రేవంత్, మల్లు రవిని వెంటనే విడుదల చేసి శ్రీశైలం ఘటనాస్థలాన్ని సందర్శించే విధంగా ఏర్పాటు చేయాలి’’ అని ఉత్తమ్ డిమాండ్ చేశారు.