నకిలీ శానిటైజర్ తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో అందరూ శానిటైజర్ వాడుతున్నందున జీడిమెట్లకు చెందిన వికాస్ అనే వ్యక్తి యూట్యూబ్లో చూసి శానిటైజర్ తయారీ చేస్తుండగా పోలీసులు దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.