హైదరాబాద్ ఫార్మాసిటీలో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేల చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. స్థానికుల ప్రయోజనాలకు పెద్ద పీట వేసెలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫార్మాసిటీ కోసం భూమి ఇస్తున్న కుటుంబాల్లో కనీసం ఒకరికి ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఈ దిశగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.