దేశంలో కరోనా విజృభణ ఆగడం లేదు. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరో 912 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు 30 లక్షల మార్క్‌ను దాటాయి.