ప్రపంచదేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. తాజాగా శనివారం ఒక్కరోజే 2 లక్షల 61 వేల 622 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 33 లక్షలు దాటింది. 8 లక్షల 7 వేల మంది మరణించగా.. కోటీ 59 లక్షల మందికిపైగా వైరస్ నుంచి కోలుకున్నారు. అమెరికా, బ్రెజిల్, రష్యాలో వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉంది.