జలపాతం వద్ద సెల్ఫీ దిగాలనే సరదా ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం చింతోని గుంపు జలపాతం వద్ద సెల్ఫీ దిగుతూ విద్యార్థిని ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతైంది. పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.